వరంగల్ నగరంలో శుక్రవారం మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ను ఏర్పాటు చేశారు. కాగా భారీగా నిరుద్యోగులు రావడంతో జాబ్ మేళాలో తొక్కిసలాట జరిగింది. హోటల్ ప్రధాన ద్వారం అద్దం ధ్వంసం అయి, ముగ్గురు మహిళ నిరుద్యోగులకు స్వల్ప గాయాలు అయ్యాయి. వీరిని స్థానిక ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు.