వరంగల్ బస్టాండ్ ప్రదేశంలో బాంబుల పేల్చివేత

వరంగల్ బస్టాండ్ స్థానంలో నూతనంగా మోడల్ బస్టాండ్ నిర్మిస్తున్నారు. పనుల్లో భాగంగా పిల్లర్లు నిర్మించే క్రమంలో భూమిలో బండరాళ్లు ఉండడంతో తొలగించడం అనివార్యమైంది. ఈ రాళ్లను తొలగించేందుకు మంగళవారం కాంట్రాక్టర్ జిలెటిన్ స్టిక్స్ (బాంబులు) పెట్టి పేల్చివేశాడు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో బస్సులో పెద్ద బండరాయి పడింది. ఈ రాయి తాకడంతో బస్సు కిటికీల అద్దాలు పగిలి డ్రైవర్, కండక్టర్లకు స్వల్పగాయాలయ్యాయి.

தொடர்புடைய செய்தி