స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని జఫర్గడ్ మండల కేంద్రంలోని తీగారం గ్రామంలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. హోలీ ఆడుదామంటూ గోనెల ప్రవీణ్ అనే యువకుడిని స్నేహితులు వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి కత్తితో దాడి చేశారు. స్థానికులు గమనించి యువకుడిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శనివారం ఎంజీఎం మార్చురీలో పోస్ట్ మార్టం నిర్వహిస్తారు.