స్టేషన్ ఘనపూర్ చిల్పూర్ గుట్టలోని ఎమ్మార్వో ఆఫీసు ముందు నుండి కొంతమంది ట్రాక్టర్ డ్రైవర్లు మైనింగ్ చేసిన మట్టి తరలిస్తుండగా, ఆర్ఐ వినీత్ కుమార్, సిబ్బంది మట్టిని ప్రభుత్వ అనుమతితోనే తరలిస్తున్నారా అని సోమవారం ట్రాక్టర్ డ్రైవర్లను ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన ట్రాక్టర్ డ్రైవర్లు అధికార కాంగ్రెస్ పార్టీ యువకుడికి సమాచారం ఇవ్వగా, ఎమ్మార్వో కార్యాలయానికి తాళం వేసి సిబ్బందిపై దాడికి ప్రయత్నించారు.