నర్సంపేట: రోడ్డు సరిగ్గా లేక ఇబ్బంది పడ్డ భక్తులు

నర్సంపేట పట్టణంలో ఉన్న హిందూ దేవాలయాలను అధికారులు, పట్టణ పాలకవర్గాలు పట్టించుకోవడం లేదని బిజెపి నాయకులు బాల్నే జగన్ ఆరోపించారు. మంగళవారం నాగుల చవితి సందర్బంగా మహబూబాబాద్ రోడ్ ద్వారకపేట పరిధిలో ఉన్న నాగదేవత దేవాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. వారికి కనీస సౌకర్యలు కల్పించని మున్సిపాలిటీ అధికారుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూసైనా మొరం పోయాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி