నర్సంపేట: అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యం స్వాధీనం

నర్సంపేట పట్టణంలోని వరమ్మతోట ప్రాంతానికి చెందిన ఎక్కటి కిరణ్ ఇంట్లో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారన్న సమాచారం మేరకు మంగళవారం రాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సుమారు 25 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని కిరణ్ పై కేసు నమోదు చేసినట్లు సీఐ రమణమూర్తి తెలిపారు. పట్టుబడిన బియ్యం విలువ సుమారు రూ. 65, 000 ఉంటుందన్నారు. ఈ తనిఖీల్లో ఎస్సైలు రవికుమార్, అరుణకుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி