జిల్లాలో కుటుంబ డిజిటల్ సర్వే నిర్వహణలో భాగంగా జిల్లా కలెక్టర్ డా. సత్య శారద శనివారం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మధిర, మందపల్లి గ్రామంలో కుటుంబ సర్వే నిర్వహణను పరిశీలించి తగిన సలహాలు సూచనలు చేశారు. కుటుంబ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాల్సిందిగా దుగ్గొండి తహసీల్దార్ రవిచంద్ర రెడ్డికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లెక్కల అరుంధతి, ఎంపీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.