నేటి నుండి తెలంగాణలో బొడ్డెమ్మ పండుగ

వరంగల్ జిల్లాలో ఆదివారం నుండి బొడ్డెమ్మ పండుగకు ఆడపడుచులు సిద్ధమయ్యారు. పూర్వకాలం నుంచి ఏటా బతుకమ్మ పండుగ ప్రారంభమయ్యే అమావాస్య రోజు ముందువరకు బొడ్డెమ్మ పండుగను యువతులు, బాలికలు వైభవంగా జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు పల్లె సుద్దుల గీతాలు, ప్రాచీన పాటలను చప్పట్లతో పాడుతూ సంబురంగా జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ ప్రారంభానికి ఒక రోజు ముందుగా నిమజ్జనం చేస్తారు.

தொடர்புடைய செய்தி