ములుగు జిల్లాలో యువకుడిని ఢీకొట్టిన లారీ

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి - తాడ్వాయి మధ్య మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. ఏటూరునాగారానికి చెందిన మిషన్ భగీరథ కార్మికుడు సునీల్ అనే యువకుడు బైకుపై వస్తున్న క్రమంలో లారీ ఢీకొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్ కు తరలించారు.

தொடர்புடைய செய்தி