తాడ్వాయి మండలంలో కురిసిన భారీ వర్షం

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో 15 రోజులుగా వర్షాలు లేక ఆందోళన చెందుతున్న రైతులకు గురువారం కాస్త ఉపశమనం కలిగింది. తాడ్వాయి మండలంలో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో వరి నాట్లు వేసిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరి నాట్లు వేసిన నాటి నుండి సరిగా వర్షాలు పడక వరి ఎండిపోతుందని రైతులు ఆందోళన చెందారు. ఈరోజు మధ్యాహ్నం కురిసిన వర్షం రైతులకు ఆనందాన్నిచ్చింది.

தொடர்புடைய செய்தி