పస్ర గుండ్లవాగు వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్ర గుండ్లవాగు వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. మొద్దులగూడెం మూల మలుపు వద్ద ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన ఓ కారు ఓవర్ స్పీడుతో వచ్చి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కాగా కారు 33 కేవి విద్యుత్ లైన్ స్తంభాన్ని ఢీ కొట్టగా తాడ్వాయి మండలంలో విద్యుత్ సరఫరా నిలిచిందన్నారు.

தொடர்புடைய செய்தி