పాలకుర్తి: మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల పరిధిలోని నర్సింగాపురం గ్రామంలో పది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కప్పల వీరాంజనేయులు కి కుటుంబ సభ్యులు మంగళవారం దశదినకర్మ జరిపించారు. ఈ సందర్బంగా కొడకండ్ల కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సురేష్ నాయక్ మండలంలోని ముఖ్య నాయకులు తన తోటి పూర్వ విద్యార్థులు కలిసి అతని కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కూడా పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி