జనగామ జిల్లాలో ఎంసిహెచ్ ఆసుపత్రి కాంట్రాక్టు ఉద్యోగులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఆరు నెలల నుండి జీతాలు రావడం లేదంటూ జనగామ - సిద్దిపేట ప్రధాన రహదారి పై ఎంసీహెచ్ ఆసుపత్రి ఎదుట కాంట్రాక్టు ఉద్యోగులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పండుగ వేళ పస్తులుంటున్నామని వాపోయారు.