మహబూబాబాద్ జిల్లా మరిపెడ లోని సోషల్ వెల్ఫెర్ లో సోషల్ వెల్ఫేర్ సొసైటీ 4వ జోన్ 10వ జోనల్ గేమ్స్ ను సోమవారం ఎమ్మెల్యే రామచందర్ నాయక్ ప్రారంభించారు. 5 జిల్లాలకు చెందినసోషల్ వెల్ఫెర్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రీడలకు 935 మంది విద్యార్థులు పాల్గొననున్నారు. క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు.