మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ మున్సిపల్ కేంద్రంలో మంగళవారం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 108 వ జయంతి వేడుకలను మంగళవారం డోర్నకల్ ఎమ్మెల్యే, విప్ రామచందర్ నాయక్ ఘనంగా నిర్వహించారు. అభిమానులు, పార్టీ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసి పేదలకు పండ్లు పంచిపెట్టారు. ఆమె దేశానికి చేసిన సేవలను, వివిధ సంస్కరణలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్చంద సేవా సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.