ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలి

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మహబూబాద్ జిల్లాలోని కురవి మండలంలోని తాటియ తండా గ్రామంలో పర్యావరణ దినోత్సవం సందర్భంగా బ్రైట్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం, పర్యావరణ ఆవశ్యకత ,ర్యాలీలు, ఉపన్యాసం, చిత్రలేఖనం పోటీలలో విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఆ సంస్థ సెక్రటరీ బోడ సిద్దు నాయక్ మాట్లాడుతూ పర్యావరణలో మన మానవుల పట్ల చాలా బాధ్యత ఉంది. చెట్లను నాటితే అవి భావి తరాలకు పుట్టినిల్లుగా ఉంటాయి ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి మన రాష్ట్రాన్నే సస్యశ్యామలంగా పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో సిద్దు నాయక్ ,మహేష్ సంతోష్ , గణేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி