మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తోడేళ్ళగూడెం గ్రామం అంగన్వాడీ కేంద్రంలో గురువారం కుళ్లిపోయిన గుడ్లు పంపిణీ చేశారని తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. తనకు పైనుండి వచ్చినవి అని అంగన్వాడీ టీచర్ దురుసుగా సమాధానం చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన గుడ్లు పంపిణీ చేయాలని, కుళ్లిన గుడ్లు పంపిణీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్.