బయ్యారం: పెళ్లి నిశ్చయం.. యువకుడు మృతి

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం మిర్యాలపెంట సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారేపల్లి సూర్యతండాకు చెందిన కళ్యాణ్, విజయ్ బైక్ పై స్నేహితుడి పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్నారు. మిర్యాలపెంట వద్ద బైక్ అదుపు తప్పి కళ్యాణ్ కు రోడ్డుపక్కన ఉన్న చెట్టు దుంగ తాకడంతో మృతి చెందాడు. విజయ్ గాయంతో బయటపడ్డాడు. కళ్యాణ్ కు 2 నెలల క్రితమే వివాహం నిశ్చయమవగా హోలీ తర్వాత పెళ్లి పెట్టుకుందామనుకున్నారు.

தொடர்புடைய செய்தி