భూపాలపల్లి జిల్లా లోని కాళేశ్వరంలో కార్తీక శోభ సంతరించుకుంది. బ్పవిత్ర కార్తీకమాస రెండవ సోమవారం కావడంతో భక్తుల రద్దీ నెలకుంది. వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, మంచిర్యాల్, మహరాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వచ్చారు. నది మాతకు దీపాలు వదిలారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి మారేడు దళాలు సమర్పించి, అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు.