భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దారుణ హత్య జరిగింది. బుధవారం రాత్రి భూపాలపల్లి మాజీ కౌన్సిలర్ నాగవెల్లి సరళ భర్త రాజలింగమూర్తి (48) దారుణ హత్యకు గురయ్యాడు. రెడ్డి కాలనీ వైపు వెళుతుండగా కార్యాలయం ముందు కాపుగాసిన గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో తీవ్రంగా పొడిచారు. స్థానికులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే వైద్యులు రాజలింగమూర్తి మృతి చెందాడని నిర్ధారించారు. హత్య ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.