4 నెలల కవలలు తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. భూపాలపల్లి జిల్లా గొల్లపల్లికి చెందిన లాస్యశ్రీ, అశోక్ కు 2వ సంతానంగా కవలలు జన్మించారు. తల్లి పాలు సరిపోక శనివారం ఉదయం డబ్బా పాలు పట్టించి పడుకోబెట్టారు. మధ్యాహ్నం అయినా వారిలో కదలిక లేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. డబ్బా పాల వల్లే పిల్లలు చనిపోయారని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.