TG: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం షాకింగ్ ఘటన జరిగింది. అక్కడ రామచంద్ర కాలేజ్ బాయ్స్ హాస్టల్ వద్దకు ఫుల్లుగా మద్యం సేవించి వార్డెన్‌ను ఓ కానిస్టేబుల్ బెల్టుతో కొట్టాడు. అడ్డుకునేందుకు వచ్చిన విద్యార్థులు, మహిళలతో కానిస్టేబుల్ అసభ్యకరంగా మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో బాధితులు 100కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.