మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకుల బ్యాగుల తనిఖీలు కొనసాగుతున్నాయి. శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ థాకరే ప్రచారానికి వచ్చినప్పుడు ఈసీ అధికారులు ఆయన బ్యాగులను మంగళవారం తనిఖీ చేశారు. అయితే తాజాగా డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విషయంలోనూ ఇదే జరిగింది. ఎన్నికల ప్రచారం కోసం బుధవారంనాడు బారామతి వచ్చినప్పుడు ఎన్నికల అధికారులు తన బ్యాగులను తనిఖీ చేసినట్టు అజిత్ పవార్ ఒక ట్వీట్లో తెలిపారు.