ప్రముఖ ఆస్ట్రేలియన్ WWE రెజ్లర్ బ్రాన్సన్ రీడ్ (జెర్మైన్ హేలీ) కన్నుమూశారు. ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన 'క్రౌన్ జువెల్' పోటీలో భాగంగా, స్టేజీ పైనుంచి మరో రెజ్లర్ తోసేయడంతో ఆయన పక్కటెముకలు విరిగి, కిడ్నీ సమస్యలు తలెత్తాయి. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. అయితే, ఆయన వైద్యపరమైన సమస్యల వల్లే మరణించారని WWE ప్రకటించింది. ఆయనకు భార్య పైజ్ (ప్రస్తుతం గర్భవతి), ఒక కుమార్తె ఉన్నారు. క్రీడా ప్రపంచంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.