TG: గజ్వేల్ శివారులో కారు డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టిన ప్రమాదంలో గాయపడిన బాధితులను కేంద్ర మంత్రి బండి సంజయ్ కాపాడి మానవత్వం చాటుకున్నారు. సిరిసిల్ల వెళ్తుండగా ఈ ఘటనను గమనించిన ఆయన, భద్రతా సిబ్బందితో కలిసి కారులో చిక్కుకున్న భార్యాభర్తలు, తీవ్రంగా గాయపడిన వారి కుమార్తెను బయటకు తీశారు. అనంతరం బాధితులను పోలీస్ వాహనంలో ఆసుపత్రికి తరలించి, వారికి మెరుగైన వైద్యం అందించాలని పోలీసులను ఆదేశించారు. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రమాదంలో ప్రయాణికులకు పెద్ద ప్రాణనష్టం తప్పింది.