AP: కూటమి ప్రభుత్వం అమరావతిలో ఉగాది వేడుకలు జరపనుంది. వేడుకల నిమిత్తం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు విడుదల చేసింది. ఒక్కో జిల్లాకు రూ.10 లక్షలు కేటాయించింది. ఇక ఈ వేడుకల్లో పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, పురస్కారాల ప్రదానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.