రేబిస్‌తో రెండేళ్ల బాలుడు మృతి

AP: పల్నాడు జిల్లా ఈపూరు మండలం బొగ్గరం గ్రామానికి చెందిన రెండేళ్ల రుద్రాన్స్‌ను సుమారు 15 రోజుల క్రితం కుక్క కరిచింది. కుక్క కాటును చిన్న విషయంగా భావించి, సకాలంలో రేబిస్‌ వ్యాక్సిన్‌ తీసుకోకపోవడంతో చిన్నారిలో రేబిస్‌ లక్షణాలు బయటపడ్డాయి. నరసరావుపేట, గుంటూరు ఆసుపత్రుల్లో చికిత్స అందించినా, పరిస్థితి విషమించడంతో చిన్నారి మృతి చెందాడు. కుక్క కాటును నిర్లక్ష్యం చేయరాదని, వెంటనే వైద్యులను సంప్రదించి రేబిస్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

தொடர்புடைய செய்தி

✕
✕