హీరో ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తోన్న ‘రాజాసాబ్’ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజైన సంగతి తెలిసిందే. చెక్స్ షర్టులో ప్రభాస్ చాలా స్టైలిష్గా కనిపించారు. అయితే, ఇదే షర్టును ‘విశ్వం’ మూవీలో హీరో గోపీచంద్ వేసుకున్నారని..అదే షర్ట్ ను ప్రభాస్ రాజా సాబ్ లో వేసుకున్నాడని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. బడ్జెట్ తగ్గడానికి ఇలా చేశారని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై నిర్మాత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.