ఉత్తరప్రదేశ్లోని లఖ్నవూలో పార్కింగ్ స్థలం వివాదం ముగ్గురి ప్రాణాలు తీసింది. అక్టోబర్ 26న సాదత్గంజ్ ప్రాంతంలో 2 కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఆగ్రహానికి గురైన 30 ఏళ్ల శుక్లా తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన శివాజీ తివారీ (62), శివేంద్ర తివారీ (55), సుయాశ్ తివారీ (30) మృతి చెందారు. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో నిందితుడు 22 సెకన్లలో ఐదు రౌండ్లు కాల్చినట్లు కనిపించింది. రెండు రౌండ్లు కాల్చిన అనంతరం తుపాకీని రీలోడ్ చేసి మరో మూడు కాల్పులు జరిపాడు. తనను ఇటుకతో కొట్టినందుకే కాల్పులు జరిపానని వీడియోలో పేర్కొన్నాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.