పంజాగుట్టలో రివాల్వర్‌తో బెదిరింపులు

హైదరాబాద్ పంజాగుట్టలో ఓ వ్యక్తి రివాల్వర్‌తో హల్​చల్​ చేశాడు. ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో బిల్లు డబ్బులు తిరిగి ఇవ్వాలని రెస్టారెంట్​ సిబ్బందిపై బెదిరింపులకు దిగాడు. బార్‌లో కస్టమర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా బౌన్సర్లు కల్పించుకుని ఇరువర్గాలను బయటకు పంపించారు. అనంతరం నిందితుడు మహమ్మద్ షానవాజ్(24) రివాల్వర్‌తో కస్టమర్లు, బౌన్సర్లను బెదిరించాడు. తాము కట్టిన బిల్లు డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు, నిందితుడి అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி

✕
✕