అసెంబ్లీ గేటును తాకనివ్వం అని ఛాలెంజ్‌ చేశారు: పవన్

AP: పిఠాపురంలోని చిత్రాడలో జరుగుతున్న జనసేన 12వ ఆవిర్భావ దినోత్సంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గతంలో వైసీపీ నేతలు అసెంబ్లీ గేటును తాకనివ్వం అని ఛాలెంజ్‌ చేసిన తొడలను బద్దలుకొట్టి శాసనసభలో అడుగుపెట్టామన్నారు. 'ప్రయాణంలో ఆటంకాలు వచ్చినా.. వెనకడుగు వేయలేదు. మనం నిలబడ్డాం.. మనతో పాటు టీడీపీని నిలబెట్టాం. నన్ను అణచివేసేందుకు అనేక కుట్రలు చేశారు. ఈరోజు జయకేతనం ఎగురవేస్తున్నాం. జై జనసేన.. జై జనసేన' అంటూ స్టేజిపై పవన్ నినాదాలు చేశారు.

தொடர்புடைய செய்தி