పోలీసుల అదుపులో రాప్తాడు నిందితుడు

AP: అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి బాలికపై దాడి చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ధర్మవరం మండలం నాగలూరికి చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించారు. ఘటన తర్వాత బైక్‌పై నిందితుడు పారిపోతుండగా.. ధర్మవరం రైల్వేస్టేషన్ సమీపంలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత విద్యార్థినికి నిందితుడు సమీప బంధువేనని, ప్రేమను నిరాకరించడంతో దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్ టీమ్ క్లాస్ రూమ్‌లో ఆధారాలు సేకరిస్తోంది.

தொடர்புடைய செய்தி

✕
✕