‘ది ప్యారడైజ్‌’.. ఏపీలో టికెట్‌ ధరల పెంపు

నాని కథానాయకుడిగా నటించిన 'ది ప్యారడైజ్‌' సినిమా సెప్టెంబరు 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, చిత్ర బృందం టికెట్ ధరలను పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సెప్టెంబరు 23న ప్రత్యేక ప్రీమియర్ షోలకు కూడా ప్రభుత్వం అంగీకారం తెలిపింది. మల్టీప్లెక్స్‌లలో స్పెషల్ ప్రీమియర్ టికెట్ ధర రూ.400, సింగిల్ స్క్రీన్‌లో రూ.300గా నిర్ణయించారు. సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 3వ తేదీ వరకు, ప్రస్తుతం ఉన్న టికెట్ ధరపై మల్టీప్లెక్స్‌లలో రూ.75, సింగిల్ స్క్రీన్‌లో రూ.50 పెంచుకునే వెసులుబాటు కల్పించారు.

தொடர்புடைய செய்தி

✕
✕