ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన సాలెపురుగు ‘సిడ్నీ ఫన్నెల్‌ వెబ్‌ స్పైడర్‌’

‘సిడ్నీ ఫన్నెల్‌ వెబ్‌ స్పైడర్‌’ ప్రపంచంలోని సాలెపురుగుల్లోకెల్లా ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఇది కుట్టినప్పుడు శరీరంలోకి చేరే విషపదార్థాలు నిమిషాల్లోనే నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. తక్షణ చికిత్స అందించకుంటే, అరగంటలోనే ప్రాణాలు పోయే పరిస్థితి తలెత్తుతుంది. ఈ సాలెపురుగు కాటు వల్ల మనుషులకు ప్రాణాపాయం ఉంటుంది గాని, కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులకు ఎలాంటి ప్రమాదం ఉండదు.

தொடர்புடைய செய்தி