బస్సు లోయలో పడిన ఘటన.. 27కి చేరిన మృతుల సంఖ్య

నేపాల్‌లోని మర్స్యాంగ్డి నదిలో బస్సు పడిపోవడంతో మృతుల సంఖ్య 27కి చేరింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు సిబ్బందితో సహా మొత్తం 43 మంది ప్రయాణికులు ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ ఉన్న ఈ బస్సు 8 రోజుల పాటు నేపాల్‌లో ఉండేందుకు అనుమతి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రయాణికులంతా మహారాష్ట్రకు చెందిన వారని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

தொடர்புடைய செய்தி