తండ్రి కొడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక (వీడియో)

తన తండ్రి కొడుతున్నాడని ఓ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం‌లో చోటు చేసుకుంది. శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన ఓ బాలిక తన తండ్రి పెట్టే చిత్రహింసలు తాళలేక పోలీసులను ఆశ్రయించింది. తన తల్లి కరోనా‌ సమయంలో చనిపోగా, తండ్రి మరొక వివాహం చేసుకున్నాడు అని కూడా పోలీసులకు తెలిపింది. ఈ మధ్య తన తండ్రి రోజూ కొడుతున్నాడని, ఆ గాయాలను పోలీసులకు చూపించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

தொடர்புடைய செய்தி