వర్ఫ్ చట్ట సవరణకు మంగళవారం కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తక్షణమే అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్ఫ్ చట్టం విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుప్రీం కోర్టులో కేంద్రం కేవియెట్ పిటిషన్ దాఖలు చేసింది. వక్స్ చట్టంపై విచారణ జరిపే ముందు తమ వాదనలు పరిగణలోకి తీసుకోవాలని కేంద్రం సుప్రీం కోర్టును కోరింది. కాగా, వక్స్ చట్టం చెల్లుబాటును వివిధ ప్రతిపక్ష పార్టీలు సుప్రీం కోర్టులో సవాల్ చేశాయి.