TG: తల్లి మృతి.. వారం రోజులుగా మృతదేహంతో కూతుళ్లు

సికింద్రాబాద్ వారాసిగూడలో విషాదం నెలకొంది. అనారోగ్యంతో తల్లి శ్రీలలిత (45) మృతి చెందడంతో మృతదేహంతో కూతుళ్లు రవళిక (25), అశ్విత (22) ఇంట్లో వారం రోజులుగా ఉంటున్నారు. దహన సంస్కారాలకు డబ్బుల్లేక మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకున్నారు. దుర్వాసన రావడంతో స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పోలీసులు ప్రశ్నించగా.. ఒక రూమ్‌లో తల్లి మృతదేహం ఉంచి మరో రూమ్‌లో ఉంటున్నామని కూతుళ్లు జవాబిచ్చారు. పోస్ట్ మార్టం కోసం డెడ్‌బాడీని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు.

தொடர்புடைய செய்தி