ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలోని స్ట్రాత్ఫీల్డ్ పురపాలక సంఘం మేయర్గా తెలంగాణకు చెందిన కర్రి సంధ్యారెడ్డి (శాండీరెడ్డి) ఎన్నికయ్యారు. ఇప్పటివరకు డిప్యూటీ మేయర్గా పనిచేసిన ఆమె, తాజాగా స్ట్రాత్ఫీల్డ్ కౌన్సిల్ 73వ మేయర్గా బాధ్యతలు చేపట్టారు. 2028 సెప్టెంబర్ వరకు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు. స్థానిక కమ్యూనిటీకి సేవ చేసే అవకాశం లభించడం గౌరవంతో పాటు గొప్ప బాధ్యతగా భావిస్తున్నానని సంధ్యారెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఖైరతాబాద్కు చెందిన సంధ్యారెడ్డి, 1991లో ఆస్ట్రేలియాకు వెళ్లి ఇమిగ్రేషన్ న్యాయవాదిగా స్థిరపడ్డారు.