ఎయిడ్స్‌ నియంత్రణలో తెలంగాణ అగ్రగామి

'మొబిలైజేషన్‌ ఫర్‌ ఎయిడ్స్‌ సురక్షా' (ఎంఏఎస్‌) కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. నవంబరు 30న టీజీ సాక్స్‌-ఎస్‌ఏసీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ విద్యాసాగర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. నవంబరు 25 నాటికి రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 31 జిల్లాలు 'సురక్షిత్‌' హోదాను పొంది ఈ ఘనత సాధించాయని ఆయన తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్దేశించిన 95-95-99 లక్ష్యాల పురోగతి ఆధారంగా ఈ ర్యాంకులను నిర్ణయించారు.

தொடர்புடைய செய்தி

✕
✕