ఐసీఐసీఐ బ్యాంక్‌ సేవల్లో సాంకేతిక అంతరాయం

ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ ఐసీఐసీఐ సేవల్లో బుధవారం సాంకేతిక అంతరాయం ఏర్పడింది. మొబైల్‌ యాప్‌, లాగిన్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవలను వినియోగించడంలో సమస్యలు ఎదురవుతున్నాయని పలువురు యూజర్లు సోషల్‌ మీడియాలో తెలిపారు. మధ్యాహ్నం నుంచి ఫిర్యాదులు వస్తున్నట్లు డౌన్‌డిటెక్టర్‌ వెల్లడించింది. లాగిన్‌ చేసేందుకు ప్రయత్నిస్తే కస్టమర్‌ కేర్‌ను సంప్రదించాలనే సందేశం వస్తున్నట్లు కొందరు పేర్కొన్నారు. ఈ అంతరాయంపై ఐసీఐసీఐ బ్యాంక్‌ నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు.

தொடர்புடைய செய்தி

✕
✕