టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దుబాయ్‌లో అల్ట్రా-లగ్జరీ ఇంటిని కొనుగోలు చేశారు. 'డెనుబ్ ప్రాపర్టీస్'కు చెందిన 'షారుఖ్జ్ రెసిడెన్సెస్'లో ఈ ఆస్తిని దక్కించుకోవడం ద్వారా, బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌కు సూర్య పొరుగున నివసించబోతున్నారు. దుబాయ్‌లోని జీవన ప్రమాణాలు, అత్యున్నత భద్రత, ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్‌లో ఉన్న 40కి పైగా ప్రీమియం సదుపాయాలు తనను ఆకట్టుకున్నాయని సూర్య తన SM వేదికగా తెలిపారు. తన క్రికెట్ కెరీర్‌తో పాటు వ్యక్తిగత ఆస్తుల కొనుగోలులోనూ సూర్య దూసుకుపోతున్నారు.