సునీల్ బన్సల్‌కు మళ్లీ తెలంగాణ పగ్గాలు!

తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా సునీల్ బన్సల్‌ను పార్టీ అధిష్ఠానం మరోసారి కొనసాగించింది. ఆయనతో పాటు అబయ్ పాటిల్, రేఖా శర్మలను కో ఇంచార్జ్‌లుగా నియమించింది. పశ్చిమ బెంగాల్ బాధ్యతను కూడా సునీల్ బన్సల్‌కే అప్పగించారు. కొన్ని నెలల క్రితం జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాలు సాధించి మెజారిటీ దక్కించుకున్న నేపథ్యంలో ఆయనకు అక్కడి బాధ్యతలను కొనసాగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో పార్టీ సంస్థాగత వ్యవహారాలు, బూత్ స్థాయి నిర్మాణం, రాజకీయ కార్యాచరణను కొత్త టీమ్ సమన్వయంతో ముందుకు తీసుకెళ్లనుంది.

தொடர்புடைய செய்தி

✕
✕