ఆరేళ్ల త‌ర్వాత తెరుచుకున్న శ్రీ గుండిచా దేవాల‌యం

ఒడిశాలోని ప్రఖ్యాత శ్రీ గుండిచా దేవాలయం ఆరేళ్ల తర్వాత భక్తుల కోసం తెరుచుకుంది. కోవిడ్‌ సమయంలో 2020లో మూసివేసిన ఈ ఆలయాన్ని బుధవారం తిరిగి ప్రారంభించారు. జగన్నాథుడి జన్మస్థలంగా భావించే ఈ ఆలయాన్ని ‘జన్మవేది’ అని కూడా పిలుస్తారు. ప్రారంభానికి ముందు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా.. ఉదయం 7.45 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. తొలి మూడు రోజులు ఉచిత దర్శనం కల్పించనుండగా.. ఆ తర్వాత రూ.10 ప్రవేశ రుసుము వసూలు చేయనున్నారు.

தொடர்புடைய செய்தி

✕
✕