రైల్వే‌స్టేషన్‌లో అడుక్కుంటున్న 'స్పైడర్ మ్యాన్'.. వీడియో వైరల్

స్పైడర్ మ్యాన్ వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి రైల్వే స్టేషన్ బయట అడుక్కుంటూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్ బయట ఈ దృశ్యాలు కనిపించాయి. ఓ వ్యక్తి వినూత్నంగా స్పైడర్ మ్యాన్ దుస్తులు ధరించి భిక్షాటన చేశాడు. కొంతమంది అతడికి దానం చేశారు కూడా. కాగా, దీనిపై నెట్టింట నవ్వులు పూస్తున్నాయి.

தொடர்புடைய செய்தி