తెలంగాణలో ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఓటు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఫిబ్రవరి 27న ప్రభుత్వం ప్రత్యేక సెలవు ప్రకటించింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల విషయంలో సీఈవో సుదర్శన్ రెడ్డి పలు సూచనలు చేశారు. ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులు ఓటు వేసేలా సహకరించాలని సీఈవో కోరారు. షిఫ్టుల సర్దుబాటు, ఓటు వేసేందుకు సమయం ఇవ్వాలని సీఈవో కోరారు.