రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పట్టణంలోని కోరుట్ల బస్టాండ్, ఆలయ పరిసర ప్రాంతాల్లో కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. దీంతో ప్రజలు, ప్రయాణికులు, రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కాలంలో కుక్కకాటుకు గురై చాలా మంది ఆసుపత్రిలో సైతం చేరిన విషయం మనందరికీ తెలిసిందే.