రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రోడ్లన్నీ ఉదయం 10 గంటలు అయిందంటే నిర్మానుషంగా మారుతున్నాయి. వేసవికాలం, పరిశ్రమలకు నిలయంగా ఉన్న ప్రతి సంవత్సరం అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఈ క్రమంలో పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరుకోవడంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాతే జనాలు బయట కనిపిస్తున్నారు.