పెద్దపల్లి: పట్టణాభివృద్ధికి ప్రత్యేక కృషి: ఎమ్మెల్యే

పెద్దపల్లి పట్టణాభివృద్ధి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఆదివారం పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 15, 16, 17, 18 వార్డుల్లో రూ. 2. 11 కోట్ల టియుఎఫ్ ఐడిసి నిధులతో చేపట్టే సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాల పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో విండో ఛైర్మన్ నర్సింహ రెడ్డి, మాజీ జడ్పీటీసీ రాంమూర్తి, ఏపిఎం సంపత్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி