పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలి

గ్రామపంచాయితీ కార్మికులు సమస్యల పరిష్కారం కోసం పెద్దపల్లి ఎంపిడిఓ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన నిర్వహించారు. పంచాయతీ సిబ్బందికి 2వ పిఆర్సి వర్తింపజేయాలని, వేతనాలు పెంచాలని, పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని ఎంపిడిఓకు వినతిపత్రం అందజేశారు. మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలన్నారు. ఈకార్యక్రమంలో సీపెల్లి రవీందర్, యూనియన్ మండల అధ్యక్షుడు మామిడిపల్లి తిరుపతి, అశోక్, ముస్తఫా, రాజేశం పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி